వీరమల్లు సైట్స్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో భారీ సక్సెస్ సాధించి పాలిటిక్స్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క తాను సెట్స్ పై మధ్యలోనే వదిలేసిన మొదటి సినిమా హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తుంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న హరిహర వీరమల్లు దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి చేయడానికి.. పార్ట్ వన్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట పవన్.

Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit - Wikipedia

ఈ క్రమంలో తన కాల్ షీట్స్ ని ముందుగా వీరమల్లు సినిమాకి కేటాయించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ సినీ ప్రొడ్యూసర్ కు పవన్ ఈ కబుర్లు పంపించాడని.. అన్ని సిద్ధం చేసుకుని ఉంటే నేను షూటింగ్ కి వస్తానంటూ వివరించాడని.. డేట్స్ పై మాత్రం క్లియర్ క్లారిటీ ఇవ్వలేదంటూ తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈనెల చివరిలో లేదా జులై సెకండ్ వీక్ లో ప్రారంభమవుతుందని టాక్. ఇక ముందే పవన్ సమాచారం అందించడంతో మూవీ యూనిట్, మేకర్స్, ప్రొడక్షన్ వర్క్‌ ప్రారంభించారని తెలుస్తోంది.

Hari Hara Veera Mallu (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

కాగా ఈ సినిమా ముందుగా క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టగా.. ప‌వ‌న్‌ పొలిటికల్ గ్యాప్ తో క్రిష్ చాలా టైం వృధా అయిపోతుందని.. ఈ సినిమాను వదిలి పెట్టేశారు. ఇక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో దర్శకత్వం బాధ్యతలు నిర్మాత ఎం. ఎం. రత్నం కొడుకు జ్యోతి కృష్ణ స్వీకరించాడు. ఈయన గతంలోనూ డైరెక్టర్ గా పలు సినిమాలను రూపొందించాడు.. ఇప్పుడు జ్యోతి కృష్ణ పర్యవేక్షణలో హరిహర వీరమల్లు డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో బాబి డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.