దేవుడికి తలనీలాలు.. నోట్లో త్రిశూలంతో దర్శనమిచ్చిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో తలనీలాలను అర్పించి.. నాలుకకు త్రిశూలం గుచ్చుకొని కనిపిస్తున్న మహిళ ఎవరు గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ్లో హీరోయిన్గా రాణించింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకుంది. అయితే తెలుగులో హీరోయిన్గా నటించింది ఒక్క సినిమానే అయినా యూత్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ.. ఎందుకో తెలుగులో హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ లో కొనసాగలేకపోయింది. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ న‌టించి ఆకట్టుకుంది.

Saranya Nag Telugu, Tamil Movie Actress Images, Pictures | Actress, Actors and Movie Gallery

కేవలం తమిళ్ సినిమాలకు మాత్రమే పరిమితమై స్టార్ హీరోయిన్గా మారింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఈమె మరెవరో కాదు టెన్త్ క్లాస్ సినిమాతో యూత్ కు కనెక్ట్ అయిన హీరోయిన్ శరణ్య. అప్పట్లో ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఎంతోమంది యూత్ కు ఫేవరెట్ హీరోయిన్గా మారింది. అయితే తాజాగా ఆమె తమిళనాడులోని ఓ ప్రముఖ దేవాలయం తిరుత్తని.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కను తీర్చుకుంది. తన తలనీలాలను సమర్పించడంతోపాటు నాలుకపై త్రిశూలం పొడిని మొక్కు చెల్లించింది.

Telugu Movie 10th Class - Bharath, Saranya - SuperHit Full Movie

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శరణ్య. దీంతో అవి కాస్తా క్షణాల్లో వైరల్ గా మారాయి. సాధారణంగా ఆడవాళ్లు జుట్టు మొత్తం కత్తిరించుకోవాలంటే చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే దేవుడి మొక్కైనా సరే.. మూడు కత్తెరలు అంటూ కాస్త జుట్టును మాత్రమే దేవుడికి మొక్కుగా చెల్లిస్తారు. అందులోనూ స్టార్ సెలబ్రిటీస్ అయితే ఇలాంటి మొక్కలను మొక్కుకోరు కూడా. చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ శరణ్య మాత్రం ఇలా తలనీలాలను పూర్తిగా మొక్కు చెల్లించేసి.. అభిమానులను, నేటిజనులను ఆశ్చర్యపరిచింది.