సోషల్ మీడియాలో ఇప్పుడు రజనీకాంత్ కి సంబంధించిన ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. రజినీకాంత్ అంటే పడి చచ్చిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు ఊగిపోయే ఫ్యాన్స్ కోట్లల్లోనే ఉంటారు . ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది ఆయనను అవమానించాడు ఒక స్టార్ హీరో అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
మనకు తెలిసిందే ..రీసెంట్ గానే నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య, నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ల పెళ్లి ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీళ్ల లవ్ మ్యాటర్ అందరికి తెలిసిందే. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుఐశ్వర్య-ఉమాపతి పెళ్లి గుళ్లోజరిగింది. అది కూడాగత ఏడాది చెన్నైలో అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం సింపుల్ గా చేసుకున్నారు.
అయితే పెళ్లి తరువాత రిసెప్షన్ పెట్టుకున్నారు. గత శుక్రవారం చెన్నైలో వీళ్ల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, తో పాటు పలువురు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు . అంత వరకు బాగానే ఉంది. వేదికపైకి వచ్చిన రజనీ.. వధూవరులను అభినందించి.. తాను వారికి తీసుకొచ్చిన బహుమతిని వారికి అందించారు. అయితే ఆ బహుమతిని ఆ జంటతో పాటు అర్జున్ మరియు సోదరుడు రామయ్య ఫ్యామిలీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో దాన్నిపక్కన పెట్టేశారు రజినీకాంత్. దీనికి సంబంధించిన వీడియో విడుదలై వైరల్గా మారడంతో.. సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.