ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిన మూవీ అదేనా..? అంతలా ఏడ్చిందా..?

ఆర్తి అగర్వాల్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఎంతోమంది కుర్రాళ్లనును గిలిగింతలు పెట్టిన స్టార్ హీరోయిన్ . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . వామ్మో ఒకటారెండా బ్యాక్ టు బ్యాక్ ఎన్ని హ్యాట్రిక్ హిట్స్ అందుకుందో . నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, నువ్వు నాకు నచ్చావ్ ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది ఆర్తి అగర్వాల్ .

ఎంత చక్కగా ఉంటుందో.. ఎంత ట్రెడిషనల్ గా ఉంటుందో.. ఎంత అందంగా ఉంటుందో.. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తనివి తీరదు . పాపం అదే ఆమెకు మైనస్ గా మారినట్టుంది . అందుకే అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆర్తి అగర్వాల్ . ఇండస్ట్రీలో ఎంత టాప్ మోస్ట్ స్థానాన్ని దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే . ఇప్పటికి కొంత మంది హీరోయిన్స్ ఆర్తి అగర్వాల్ మెప్పించలేకపోతున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమె కెరియర్ కి మైనస్ అయ్యేలా చేశాయి . బాగా సన్నగా స్లిమ్ గా ఉన్న ఆర్తి అగర్వాల్ కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఉన్న ఫలంగా లావు అయిపోయిందట . అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది .

అంతేకాకుండా ఆమె ఒక వ్యక్తిని ప్రేమించిందని ఆ వ్యక్తి మోసం చేయడంతో డిప్రెషన్ కారణంగా చాలా చాలా సఫర్ అయింది అని అందువల్ల కూడా ఆమె లావు బాగా పెరిగిపోయింది అని అప్పట్లో వార్తలు వినిపించేవి. అయితే పరోక్షకంగా ఆర్తి అగర్వాల్ మరణించడానికి కారణం కూడా ఒక సినిమా అంటూ అప్పట్లో వార్తలు అయ్యాయి . అమ్మ రాజశేఖర్ తో ఆర్తి అగర్వాల్ రణం 2 సినిమా చేసింది. ఈ సినిమాలో చాలా చాలా స్లిమ్ గా ఉండింది ఆర్తి అగర్వాల్ .

అయితే సెకండ్ షెడ్యూల్ కి బాగా లావు పెరిగిపోయింది . అయితే ఓ రోజు షూటింగ్ సమయంలో ఎంత టైం అయిపోతున్న కార్ వ్యాన్ నుంచి బయటకు రాకపోయేసరికి అమ్మ రాజశేఖర్ లోపలికి వెళ్లి చూడగా . ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుందట. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఆమె నేను బాగా లావు అయిపోయాను.. నాకు డ్రస్సులు పట్టట్లేదు అంటూ తెగ ఏడ్చేసిందట . దీంతో అమ్మ రాజశేఖర్ చాలా ఓదార్చారట .అమ్మ రాజశేఖర్ – ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే బయటపెట్టారు . అయితే కొందరు మాత్రం ఆమె తీసుకున్న కొన్ని డెసిషన్స్ కారణంగానే ఆమె కెరియర్ స్పాయిల్ అయింది అంటూ మాట్లాడుకున్నారు..!!