ప్రభాస్ కి షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. లాస్ట్ మినిట్ లో భలే దెబ్బేశాడుగా..!

ప్రభాస్ కు లాస్ట్ మినిట్లో ఒక స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ రాజమౌళి. ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి పక్కాగా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది కల్కి టీం. సినిమా ప్రమోషన్స్ ని కూడా అదే విధంగా చేస్తుంది .

మరీ ముఖ్యంగా కల్కి సినిమా మరొక బాహుబలి రేంజ్ లో హిట్ అవ్వడానికి చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు నాగ్ అశ్వీన్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఏకంగా రాజమౌళిని రంగంలోకి దించాలి అని బాగా ట్రై చేశారు . సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి – అనుష్కను యాడ్ చేస్తూ సినిమాకి హైప్ ఇవ్వడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి . అయితే లాస్ట్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి పాల్గొనడం లేదు అంటూ తెలుస్తుంది .

ఇప్పటికే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశారట . రాజమౌళి లేకుండానే ఇంటర్వ్యూ కంప్లీట్ చేశారట . కేవలం అనుష్క – ప్రభాస్ – నాగ్ అశ్వీన్ – దిశా పటాని మాత్రమే ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. కల్కి కి ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి .. ఒకవేళ నిజంగా రాజమౌళి ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఉండి ఉంటే మాత్రం గ్లోబల్ స్థాయిలో క్రేజ్ వచ్చిండేది. ఎందుకు రాజమౌళి అటెండ్ కాలేకపోయాడు..? కావాలనేనా..? లేకపోతే ఏదైనా రీజన్ వెనకాల ఉందా..? అనే విధంగా చర్చించుకుంటున్నారు..!!