కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ అమ్మాయిగా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?!

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అది తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉదయ్.. అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా నిలిచాడు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హోదా ఎంత త్వరగా తెచ్చుకున్నాడో.. ఫ్లాప్‌ల‌తో అదే రేంజ్ లో ఇండస్ట్రీ నుంచి దూర‌మైన‌ ఆయన సూసైడ్ చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ న్యూస్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ వార్తగా నిలిచింది. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు.. దాని వెనుక కారణాలు ఏంటో ఇప్ప‌టికి తెలియరాలేదు.

Jodi No.1 (2003) - IMDb

ఇక ప్రస్తుతం ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ ఓ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించాడని.. ఆయన అలా కనిపించిన ఏకైక సినిమా అదేనంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించిన ఆ సినిమా ఏంటో.. అసలు దాని విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అదే రామకృష్ణ గౌడ్ డైరెక్షన్‌లో జోడి నెంబర్ వన్ సినిమా. సెట్స్‌ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించారు. అయితే కెన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రతాన్ని సుగుణా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాల్లో వెన్యా, శ్రీజా, కౌశల్, సుమిత్, గౌతమ్ రాజు కీలకపాత్రలో నటించారు.

Uday Kiran: ఉదయ్‌కిరణ్‌ లేడీ గెటప్‌ వేసిన సినిమా ఏదో తెలుసా ?.. అస్సలు  ఊహించి ఉండరు.. - Telugu News | Do you know that Uday Kiran did a lady getup  for the movie Jodi No.1

ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపిస్తున్న రేర్ పిక్స్ వైరల్ గా మారడంతో.. అభిమానులంతా మరోసారి ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయంతో అందరూ బాధపడ్డారని.. కాస్త ఓపికతో శ్రమించే అవకాశాలను అందిపుచ్చుకొని సినిమాల్లో నటించి ఉంటే మరోసారి త్రో బ్యాక్ అయ్యేవార‌ని.. అంతకుమించిన స్టార్‌డంతో దూసుకుపోయేవాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే.. అభిమానులు టీవీకి అతుక్కుపోయి మరి సినిమాను చూస్తారు. ఆయన తుదిశ్వాస విడిచి ఇన్నేళ్లు అవుతున్న ఇప్పటికీ ఉదయ్ కిరణ్ కు అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.