కనీసం ఇప్పటికైన ఆ పని చేయవయ్య గోపీచంద్.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

గోపీచంద్ ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో . అయితే ఇది ఒకప్పటి మాట . ఇప్పుడు ఆయన గురించి పట్టించుకునే జనాలు లేకుండా పోయారు. కెరియర్ స్టార్టింగ్ లో గోపీచంద్ తీసుకున్న కొన్ని కొన్ని కన్ఫ్యూజ్డ్ నిర్ణయాలే దీనికి కారణం అంటూ తెలుస్తుంది. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. ఆ తర్వాత విలన్ పాత్రలో మెప్పించాడు. జనాలకు ఆయనలోని హీరోయిజం కన్నా కూడా విలనిజం బాగా నచ్చింది . అందుకే విలన్ గానే బాగా ఎంకరేజ్ చేశారు . అయితే మళ్లీ హీరోగా రావడానికి ట్రై చేశాడు .. కానీ సక్సెస్ కాలేకపోయాడు.

ఈసారి విలనిజం పాత్రలు వచ్చినా సరే ఆ తప్పు చేయకుండా హీరో గానే ట్రై చేస్తూ వచ్చాడు . అయినా సరే ఇప్పటికి సక్సెస్ కాలేకపోతున్నాడు . చాలామంది బడా బడా డైరెక్టర్ లు గోపీచంద్ లోని విలన్ ని బయటకు తీయడానికి బాగా ట్రై చేస్తున్నారు . బాహుబలి సినిమాలో భల్లాల దేవుడి పాత్ర కోసం ముందుగా గోపీచంద్ ని అప్రోచ్ అయ్యారట . కానీ నెగిటివ్ పాత్ర చేయనంటే చేయను అంటూ చెప్పడంతో ఆ రోల్ రానాకి వెళ్ళిపోయింది .

ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు కూడా ఫాన్స్ అదే విధంగా సజెస్ట్ చేస్తున్నారు. రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్ర కోసం గోపీచంద్ అప్రోచ్ అయ్యారట రాజమౌళి . మళ్లీ కూడా నేను చేయను అంటూ తెగేసి చెప్పేసాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . గోపీచంద్ ఫాన్స్ సజెషన్స్ ఇస్తున్నారు. ఇకనైనా మొండి పట్టుదల వదులు ..విలన్ పాత్రలో నటించు కెరియర్ సెటిల్ అవుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఫ్యాన్స్ సజెషన్స్ ను ఏ మాత్రం తీసుకుంటాడో ఈ హీరో..??