ఓ మై గాడ్: బన్నీ కి మరో భారీ బొక్క.. ఆ సినిమా ఆగిపోయిందా..?

బన్నీ టైం బాగోలేదా..? లేకపోతే బన్నీ టైం బాగో లేకుండా కొన్ని దుష్టశక్తులు ఆయన చుట్టూరు తిరుగుతున్నాయా..? అనేది మాత్రం అర్థం కావడం లేదు. పాపం నిన్న మొన్నటి వరకు సూపర్ స్టార్.. గ్లోబల్ స్టార్ ..పాన్ ఇండియా స్టార్ అంటూ ఐకాన్ స్టార్ అంటూ రేంజ్ లో పొగిడేసారు.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయనలోని నెగిటివ్స్ ను బాగా బయట పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. దీనంతటికీ కారణం ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం . అది అందరికీ తెలిసిందే. బన్నీ కనుక వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఆయన ను ఓ రేంజ్ లో పొగిడేసి ఉండేది మెగా కుటుంబం ..మెగా ఫ్యాన్స్ .

జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసిపికి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు బన్నీ ..ఇప్పటికే పుష్ప2 సినిమా విషయంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు .. ఏకంగా సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ అట్లీ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప2 లాంటి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే సినిమానే మెగా ఫాన్స్ దెబ్బకు భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు సుకుమార్ .

అలాంటిది ఇలాంటి మూమెంట్లో అట్లీ ..బన్నీతో సినిమా తెరకెక్కించే సాహసం చేయకూడదు అంటూ సినీ విశ్లేషకులు సజెస్ట్ చేశారట. అదేవిధంగా అట్లీ ఫాలో అవుతున్నారట . బన్నీ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలు కొన్నాళ్లపాటు వాయిదా వేయాలి అంటూ డిసైడ్ అయ్యారట. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ బట్టి ఈ సినిమా తెరకెక్కించాలా ..? క్యాన్సిల్ చేసుకోవాలా..? అనే విధంగా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారట . ఇది నిజంగా బన్నీ కెరీర్ కి భారీ భారీ దెబ్బ అని చెప్పాలి..!!