మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ డైరెక్టర్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్..

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా తో మరో సినిమాలో నటించినున్నాడు చెర్రీ. ఇక‌ తాజాగా మరో సినిమాకు చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడంటూ.. RC19కూడా ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్‌తో మరోసారి కలిసి పనిచేయున్నాడట‌. ప్రస్తుతం గేమ్స్ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ మూవీని ఈ ఏడాది చివ‌రిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మ‌రో వైపు తను నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ తాజాగా రివీల్ చేశారు. ఆర్సీ 16 పేరుతో బుచ్చిబాబు డైరెక్షన్లో తెర‌కెకుతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

Ram Charan confirms collaboration with Uppena director Buchi Babu Sana

కాగా ఈ సినిమాకు పెద్ది టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న‌ ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీరోల్‌ పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను ఈ నెల 20న ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్ సి 17 కూడా ఓకే అయిందట. బుచ్చిబాబు తర్వాత రామ్ చరణ్.. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్‌గా మారిపోయిన సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడట. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా రానున్నట్టు గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభిస్తారట.

Ram Charan Upcoming Movie Project: 'RRR' star Ram Charan to team up with 'Pushpa' director Sukumar again for a pan-India project | - Times of India

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా రూపొందించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఒక రకంగా ఇది మరో రంగస్థలం కాబోతుందని తెలుస్తుంది. గతంలో రామ్ చరణ్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, దేవిశ్రీప్రసాద్ కాంబోలో రంగస్థలం సినిమా రిలీజై బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కల్లగొట్టింది. రామ్ చరణ్ మార్కెట్‌ను మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. చెర్రీలో కొత్త కోణాన్ని సుకుమార్ ఈ సినిమాతో చూపించారు. ఇందులో సమంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో.. బాహుబలి రికార్డ్స్ ఈ సినిమాతో చరణ్ సులువుగా బ్రేక్ చేసేస్తాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సంజ‌య్‌లీలా భ‌న్సాలీతో మరో సినిమాకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.