అర్జున్ రెడ్డి హిట్ అవ్వడానికి.. విజయ్ దేవరకొండకు ఉన్న ఆ వీక్నెస్సే కారణమా.. ఇంతకీ అదేంటంటే..?!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్‌ పేరు సోష‌ల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటుంది. అలాగే ఆయన చేసే కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఇదే నేపథ్యంలో విజయ్ ఎప్పుడు తన సినిమాలను వినిత్వంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ లో ఏదైనా ప్రశ్న ఎదురైతే ముక్కుసూటిగా సమాధానం చెబుతూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆ లక్షణం ఆడియన్స్‌లో చాలామందికి నచ్చుతుంది. ఈ కారణంగానే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ రౌడీ హీరో.

Vijay Devarakonda's Arjun Reddy will now be forty minutes longer - here's  why - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com

అయితే సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వరకు 100% ఇవ్వడానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ఒక విషయంలో మాత్రం విజయ్ కాస్త వీక్ అని తెలుస్తోంది. అయితే ఈ వీక్‌నెస్ అర్జున్ రెడ్డి హిట్ అవ్వడానికి బాగా కలిసొచ్చిందట. ఇంతకీ ఆ వీక్నెస్ ఏంటి.. వీక్నెస్ కలిసి రావడంతో అర్జున్ రెడ్డి హిట్ అవడం ఏంటో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ గతంలో స్వయంగా ఈ విషయాన్నివెల్లడించాడు.

Vijay devarakonda, actor, arjun reddy, telugu, vijaydevarakonda, HD  wallpaper | Peakpx

డబ్బింగ్ విషయంలో కాస్త టైం తీసుకుంటానని.. గంట కంటే ఎక్కువగా డబ్బింగ్ చెప్తే వాయిస్ లో మార్పులు వచ్చేస్తాయని.. ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అర్జున్ రెడ్డికి 40 రోజుల్లోనే డబ్బింగ్ చెప్పానని.. ఇక అందులో వాయిస్ మార్పు గమనించవచ్చంటూ వివరించాడు. అయితే అర్జున్ రెడ్డిలో ప్రతి డైలాగ్ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో రిజిస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఇక విజయ్‌ వాయిస్‌కు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో కూడా తెలిసిందే. డబ్బింగ్ విషయంలో నిదానంగా చెప్పినా.. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు తో కూడా డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్. ఇక నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ రౌడి హీరో.