బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పుష్ప 2లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్..?!

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజే కాదు నేషనల్ లెవెల్ లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి హీరోగా సంచలనం సృష్టించాడు. ఇది ఎలా అంటే ప్రస్తుతం ఈ సినిమా స్టార్‌డంను కాపాడుకుంటూ పుష్ప 2 తో మరింత క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే బన్నీ ఈ సినిమా సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

Biography of Actor Surya: A Journey Beyond the Silver Screen | by Zara |  Medium

అయితే ఈ సినిమా మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా మేకర్స్ కూడా సినిమాను రూపొందించడానికి కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాపై ఓ అదిరిపోయే అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో బన్నీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏదో కాదు ఈ సినిమాలో ఇద్దరూ టాప్ స్టార్ హీరోస్ గెస్ట్‌రోల్‌లో కనిపించనున్నారట. ఇంతకీ ఆ హీరోస్ ఎవరో తెలుసుకుందాం. జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ తో సినిమాకు ఎలాంటి హైప్‌ తెచ్చి పెట్టారో మనందరికీ తెలిసిందే.

Ranbir Kapoor - Wikipedia

అదే విధంగా పుష్ప సినిమాలో కూడా తమిళ్ నుంచి సూర్య, బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే వీరికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాలి. మొత్తానికి స్టార్ హీరోస్ నటిస్తున్నారు అంటూ వస్తున్న ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు పెరిగే హైప్ తో పుష్ప2 సెన్సేషనల్ రికార్డులు మరెన్నో సాధించడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.