చిరు, బాలయ్య లపై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్ళిద్దరూ అలా బిహేవ్ చేసే వాళ్ళంటూ..

చిరంజీవి, బాలకృష్ణ ప్ర‌స్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న వీరిద్ద‌రు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలో నటిస్తున్నారు. ఈ స్టార్ హీరోస్ ఇద్దరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రచ‌నా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ర‌చ‌న‌ బెనర్జీ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోలైన‌ బాలకృష్ణ, చిరంజీవిలపై బెనర్జీ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు ఈ సీనియ‌ర్ హీరోస్‌. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరాశి సినిమాలో, బాలయ్య ఎన్‌బికె 109 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi, Balakrishna In A Multistarrer? - Telugu Rajyam

అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ బ్యూటీ రచన బెనర్జీ మాట్లాడుతూ వీరిద్దరితో తాను నటించిన ఎక్స్పీరియన్స్ గురించి.. వారి క్యారెక్టర్స్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తను న‌టిగా కొనసాగిన రోజులను గుర్తు చేసుకుంది. బాలకృష్ణ, చిరంజీవి గారి ఇద్దరితో వర్క్ చేయడం బాగా ఎంజాయ్ చేశాన‌ని.. కానీ బాలకృష్ణ సెట్స్ లో కోపంగా ఉండేవారు అంటూ.. ఏదైనా తప్పు జరిగితే అసలు సహించేవారు కాదని వివరించింది. ఇక చిరంజీవి లాంటి వ్యక్తితో తను వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని.. చిరు లాగే అమితాబ్‌, రజిని లాంటి స్టార్ హీరోస్ కూడా సింపుల్ గా ఉండడం నాకు బాగా నచ్చుతుందని వివరించింది.

Rachana Banerjee Phone Number, House Address, Email ID, Contact Details

తెలుగు సినిమాలతో మరోసారి కమ్‌ బ్యాక్ ఇచ్చే ఆలోచనలు ఆమె ఉన్నానంటూ వివరించింది. కానీ మంచి కథ దొరికినప్పుడే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరోస్ అంటూ వివరించింది. ఇక నేను ప్రేమిస్తున్నాను సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత చిరు సర‌స‌న బావగారు బాగున్నారా, బాలయ్యతో సుల్తాన్ లాంటి సినిమాలో నటించింది. అలాగే అభిషేకం, పెద్ద మనుషులు, అంతా మ‌న మంచికే లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.