నిమ్మ‌కాయ‌లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ చాలు..!

మన ఇంట్లో ఎక్కువగా వాడే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిని ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు.. కానీ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దీంతో పద్దాక మార్కెట్ కి వెళ్లి కొనుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మనకి రోజు జరిగే బిజీ బిజీ లైఫ్ లో ఇది మనకి చాలా కష్టంగా ఉంటుంది.

అలాంటి వారి కోసమే నిమ్మకాయలను సింపుల్ చిట్కాలతో స్టోర్ చేసే విధానాలను తీసుకొచ్చాము. ఇకనుంచి నిమ్మకాయలకి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా ఉంచుకోవచ్చు. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే మీరు నిమ్మకాయలను ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. శుభ్రంగా కడిగి తుడిచిన నిమ్మకాయలకు కొద్దిగా నూనె రాసి టిష్యూ పేపర్ వేసిన బాక్స్ లో పెట్టి.. రిఫ్రిజిరేటర్ లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి.

2. ఇక నిమ్మకాయలను శుభ్రంగా కడిగిన అనంతరం వాటిని ఆరబెట్టి.. అనంతరం గాలి వెళ్ళని బాక్స్ లో పెట్టి ఫ్రిజ్లో పెడితే అస్సలు పాడవ్వవు.

3. అలాగే నిమ్మ కాయలను స్టోర్ చేసుకోలేని వారు వాటి నుంచి తీసిన నిమ్మ రసాన్ని ఫ్రిజ్లో పెట్టి వాడుకోవచ్చు.

ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి నిమ్మకాయలను సురక్షితంగా ఉంచుకోండి. దీని ద్వారా వీటికి ఎటువంటి క్రిములు సైతం ఏర్పడవు.