” భగవంత్ కేసరి ” సెన్సేషనల్ రికార్డ్.. ఏకంగా అన్ని థియేటర్స్ లో 50 రోజులు ఆడిందా. .?!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లలో దాదాపు 50 రోజులపాటు ప్రదర్శితం కావడం సులువైన విషయం కాదు. ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ విడుదలైన నెల రోజులకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేయడంతో.. 50 రోజులపాటు థియేటర్లలో సినిమా ఆడటం పెద్ద గగనం అయిపోయింది.

ఇక 50 రోజుల సెంటర్ల విషయంలో బాలయ్య హీరోగా నటించిన…” భగవంత్ కేసరి ” రికార్డ్ సృష్టించింది. రెండు వారాల క్రితమే ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతుంది. 15 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవం జరుపుకోగా అందులో 11 డైరెక్ట్ సెంటర్లు ఉంటే నాలుగు షిఫ్ట్ థియేటర్లు ఉన్నాయి.

ఇక బాలయ్య సినిమాకే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయి అని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక రాయలసీమలో ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితం కావడం ఆశ్చర్యం. ఇక ఈ మధ్యకాలంలో వరుసగా 50 రోజులు థియేటర్లలో ఆడిన లిస్ట్ లో బాలయ్య మాత్రమే ఉన్నాడు. ఇక ఈ వార్త విన్న బాలయ్య అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు.