పెళ్లిపై జబర్దస్త్ సత్యశ్రీ సెన్సేషనల్ కామెంట్స్.. ఈ బ్యూటీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?!

జబర్దస్త్ షో ద్వారా ఊహించని పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సత్య శ్రీ ఒకరు. ఈమె ఒక్క బుల్లితెరకే అంకితం కాకుండా… వెండితెరపై కూడా కొన్ని కీలక పాత్రలలో పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్‌ చేసింది. ఇక ఈమె మాట్లాడుతూ…” జబర్దస్త్ షో ద్వారా సంపాదించును డబ్బులు మా సిస్టర్ కోసం ఖర్చు పెట్టాను. ఇక మా సిస్టర్ ప్రస్తుతం ఎల్ అండ్ టీలో జాబ్ సంపాదించి పూనేలో పనిచేస్తుంది.

కొడుకునైతే ఎలా బాధ్యత తీసుకుంటాను అలా ఇప్పుడు కూడా బాధ్యతలు తీసుకున్నాను. ఇక పెళ్లి చేసుకుని భర్త షరతులు విధిస్తే ఇబ్బంది పడాలని పెళ్లి చేసుకోలేదు. అలాగే నన్ను రూల్ చేస్తే నాకు నచ్చదు. ఇక ఇప్పటివరకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్నో వచ్చాయి. ఇప్పటివరకు వాటిని ఆపుకుంటూ వచ్చాను. ఇక మా అమ్మమ్మ ఒకసారి షూటింగ్ కు పెళ్లి చూపులు తీసుకొచ్చింది.

ఒక వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చి షూటింగ్స్ లో పాల్గొనవద్దని చెప్పడంతో నేను సీరియస్ అయ్యాను. నా పేరెంట్స్ నాకు షరతులు ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఎవ్వరో బయట వాళ్ళు వచ్చి నాకు షరతులు పెడితే నేను తట్టుకోలేను. మా అమ్మ మంచి ఆర్టిస్ట్ కావాలని అనుకుంది. కానీ అవ్వలేకపోయింది. కనీసం ఆమె కల‌ను నేనైనా నెరవేరుస్తాను ” అంటూ కామెంట్స్ చేసింది సత్య శ్రీ. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.