మళ్ళీ ఐటెం సాంగ్ చేయబోతున్న తమన్నా.. ఈసారి ఆ లక్కి హీరో ఎవరంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా .. మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించి మెప్పించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో తెలుగులో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి .

బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లోనే కనిపిస్తుంది తప్పిస్తే .. ఎక్కడ సినిమాలో నటించడం లేదు . ఈ క్రమంలోనే ఓ బడా డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టార్ హీరో సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేయబోతుందట . ఇది పూర్తిగా ఆమె ఇష్ట ప్రకారమే చేస్తుందట. అంతేకాదు ఈ సాంగ్ చేస్తున్నందుకు గాను ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆమె తెలుగులో నటించిన భోళా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు నటించిన గుర్తుందా సీతాకాలం కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటెం సాంగ్స్ పై కన్నేసింది అంటున్నారు జనాలు..!!