యానిమల్‌ను క్లాసికల్ లిస్టులో చేర్చిన బన్నీ.. ఏ యాంగిల్ లో నీకు ఈ మూవీ క్లాసికల్‌గా కనిపించింది భయ్యా అంటూ..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల యానిమల్ మూవీ వీక్షించి ఆ సినిమా రివ్యూ ఇవ్వ‌టంతో మ‌రోసారి వైర‌ల్ అవురున్నాడు. ఓవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో యానిమల్ పై అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజానికి పట్టిన ఓ రోగం యానిమల్ మూవీ అంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు. కాగా ఈ ట్రోలింగ్స్ తో సంబంధం లేకుండా మరోవైపు యానిమల్ మూవీ భారీ వాశుళ‌తో నిరంతరాయంగా దూసుకుపోతుంది.

ఇప్పటివరకు ఈ మూవీ పై ఏర్పడిన హైప్‌ను మరో లెవెల్ కు పెంచాడు బన్నీ. ఏకంగా ఈ సినిమాను క్లాసికల్ లిస్టులో చేర్చేసాడు. అల్లు అర్జున్ దృష్టిలో ఈ మూవీ ఓ క్లాసిక్ మూవీఅట. తాజాగా ఈ సినిమాని చూసిన బ‌న్నీ.. యానిమల్ నటినట్టులతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కూడా ఆ రేంజ్‌లో పొగడ్తలతో ముంచేశాడు. రణ్‌బీర్ నటన వేరే లెవెల్‌లో ఉందని అతని పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత మాటలు రాలేదంటూ వివరించాడు. రష్మిక, బాబీ డియ్యల్ తమ‌ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. అనిల్ కపూర్, తృప్తి దిమ్రి తమ నటనతో అదరగొట్టారు అంటూ వివరించాడు.

ఇక సందీప్ విషయానికి వస్తే భారతీయ సినిమాను మరో రేంజ్ లోకి మార్చేసాడని.. అతడు దర్శకత్వం మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేసాడు. ఇలా అందరినీ ఆకాశానికి ఎత్తిన బన్నీ చివరిలో ఇండియన్ సినిమా క్లాసిక్స్ లిస్టులో యానిమల్ కూడా చేరిపోయిందంటూ ఓ జాతీయ జెండాను జోడించి పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ రూ.600 కోట్ల గ్రస్ దాటేసింది. కాగా బన్నీ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యానిమల్ మూవీ ఏ యాంగిల్ లో నీకు క్లాసికల్ గా కనిపించింది భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.