నాగార్జున ” నా సామి రంగ ” మూవీ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్..!!

కింగ్ నాగార్జున హీరోగా.. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా.. యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాకి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్లూరి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక అసలు విషయంలోకి వెళితే… ఈ సినిమాలో మొత్తంగా ఆరు సాంగ్స్ ఉండగా.. వాటిని కీరవాణి అద్భుతంగా కంపోజ్ చేశారని.. చాలా ఏళ్ల తర్వాత నాగ్, కీరవాణి ల కాంబో లో రానున్న ఈ సాంగ్స్ అదిరిపోనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని రానున్న 2024 సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జనవరి 10 లేదా 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే జనవరి 12న గుంటూరు కారం, హను మాన్, సినిమాలు ఉండగా.. 13న ఈగల్, సైంధవ్.. మూవీస్ బరిలో ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే అన్నిటికంటే ముందు తమ సినిమా ఆడియన్స్ ముందుకి రావాలని నా సామి రంగ ని మేకర్స్ జనవరి 10 లేదా 11న ఫిక్స్ చేశారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.