మీ మెహందీ అద్భుతంగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి…!!

ఎలాంటి ఆభరణాలు లేకున్నా మెహందీ పెట్టుకుంటే ఓ నిండు క‌ల‌ వస్తుంది. ఇక అందుకే పెళ్లి సమయంలో దీనికోసం ప్రత్యేకంగా వేడుక సైతం నిర్వహించుకుంటారు. అయితే పెళ్లికి పెట్టుకునే మెహందీ ఎంత ఎర్రగా ఉంటే.. వధువు అంత నిండుగా కనిపిస్తుందని అందరూ నమ్ముతుంటారు. మెహందీ ఎర్రగా పండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలతో మీ మెహందీ ని అద్భుతంగా పండించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. గోరింటాకు లేదా మెహందీ దానంతట అదే ఊడే వరకు ఉంచుకోవాలి.

2. మెహందీ తీసిన వెంటనే కడగకుండా.. నిమ్మరసం లేదా చక్కెర నీటితో చేతులని మసాజ్ చేసుకోవాలి.

3. పెట్రోలియం జెల్ ని అప్లై చేయడం వల్ల కూడా మెహందీ ఎర్రగా పండుతుంది.

ఈ విధంగా మీ మెహందీ ని ఎర్రగా పండేలా చేసుకుని… మీ పెళ్లిలో ప్రత్యేకమైన ఆకర్షణ కలిగించండి. ఈ సింపుల్ చిట్కాలతో మీ అందమైన చేతులకు మరింత అందాన్ని పెంచుకోండి.