నాగచైతన్య పుట్టినరోజుకి అలాంటి గిఫ్ట్ పంపించిన సామ్… గిఫ్ట్ మామూలుగా లేదుగా…!!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన వారిలో సమంత, నాగచైతన్య ఒకరు. ” ఏం మాయ చేసావే ” సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట… అనంతరం పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. నాలుగేళ్లు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసి సడన్గా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు వీరిద్దరూ ఏ కారణంతో విడిపోయారో? తెలపకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో సమంత మాజీ భర్త కోసం ఓ గిఫ్ట్ పంపించిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లయిన కొత్తలో నాగచైతన్య.. సమంతా కోసం ప్రత్యేకంగా ఒక బ్రాస్ లైట్ చేయించి ఇచ్చాడట.

అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత వీరికి సంబంధించిన ఆస్తులు, వస్తువులు వెనక్కి ఇచ్చేసుకున్నారట. కానీ ఆ బ్రాస్ లైట్ ని మాత్రం వెనక్కి ఇవ్వలేదట సమంత. ఇన్ని రోజులు ఆ బ్రాస్ లైట్ ను తన వద్ద ఉంచుకున్న సమంత.. చైతు పుట్టినరోజు సందర్భంగా ఆ బ్రాస్ లైట్ ను వెనక్కి ఇచ్చేసిందట. ఇది చూసిన నాగచైతన్య షాక్ అయ్యాడట. ఇక ఈ వార్తలు నిజం ఎంతుందో తెలియదు కానీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.