ఎట్టకేలకు హీరోయిన్ త్రిష కు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీ ఖాన్..!!

తమిళంలో సీనియర్ నటుడుగా పేరుపొందిన మన్సూర్ అలీ ఖాన్.. హీరోయిన్ త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరోయిన్ త్రిష కు అటు రాజకీయంగా ఇటు సినీ పరిశ్రమ నుంచి మద్దతు భారీగానే లభిస్తోంది. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ నడిగర్ సంఘం త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.ఆయన అయినప్పటికీ కూడా ఏమాత్రం బెదరకుండా త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటు హెచ్చరించారు.

అయితే ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన చర్యలు చేద్దాం చుట్టుముడుతూ ఉండడంతో మన్సూర్ దిగువచ్చి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.. తన సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి అంటూ మాన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలియజేయడం జరిగింది.

అంతేకాకుండా త్రిషకు వివాహం కావాలని ఆమె మంగళ సూత్రాన్ని ఆశీర్వదించే అవకాశం దేవుడు తనకు కల్పించాలంటూ మాన్సూర్ అలీఖాన్ అన్నట్టుగా రమేష్ బాల ఒక ట్విట్ చేస్తూ స్టేట్మెంట్ ని విడుదల చేశారు. త్రిష మీద చేసిన వ్యాఖ్యల పట్ల మన్సూర్ అలీ ఖాన్ పలుచోట్ల పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా మానస పోలీసుల ఎదుట కూడా హాజరయ్యారు.. మరొకవైపు జాతీయ మహిళా కమిషన్ నుండి కూడా మన్సూర్ అలీ ఖాన్ పైన పోలీస్ కేసు నమోదు కావడంతో ఆయన దిగి రావడం జరిగింది.