ఆ స్టార్ హీరోతో మూవీ చేసే ఛాన్స్ కొట్టేసిన గౌతమ్ తిన్ననూరి..!!

” మళ్లీ రావా ” సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన డాక్టర్ గౌతమ్ తిన్ననూరి…” జెర్సీ ” సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఈయనకి భారీ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటే ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగుపోయే అవకాశం ఉంది.

గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకి ఒక కథ చెప్పినట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ .. ఈ దర్శకుడి సినిమా చేయాలంటే విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ సక్సెస్ అయితే… తారక్ ఈ సినిమాని చేస్తా అన్నాడట.

ఇక ఎన్టీఆర్ కి గౌతమ్ కథ నచ్చడం కోసం ఈయన పడరాని పాట్లు పడి పాన్ ఇండియా లెవెల్ లో కథను రెడీ చేస్తున్నాడట. మరి విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ హిట్ అవ్వదో లేదో చూడాలి. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు.. ఎన్టీఆర్ భలే కండిషన్ పెట్టాడుగా.. అంటూ ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.