బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

దిల్ రాజు ప్రొడక్షన్ లో భాస్కర్ ని నిర్మాతగా పరిచయం చేస్తూ దిల్ రాజు తీసిన మూవీ ” బొమ్మరిల్లు “. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు దర్శకుడు భాస్కర్ ముందుగా సినిమా కథను ఎన్టీఆర్తో చేద్దామని అనుకున్నాడట.

ఇక ఇదే విషయాన్ని దిల్ రాజుకి చెబితే ఈయన భాస్కర్ ని తీసుకువెళ్లి ఎన్టీఆర్ ని కథ‌ వినిపించాడట. ఈ కథ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చిందట. కానీ ఇది ఎన్టీఆర్ ఇమేజ్కి సరిపడా కథ‌ కాదు కాబట్టి స్వయంగా ఎన్టీఆర్ ఏ ఇది మంచి స్టోరీ దీన్ని నాకంటే బాగుంటుంది అని చెప్పారు.

ఇక దిల్ రాజు, భాస్కర్ కలిసి ” నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన సిద్ధార్థ్‌ ని హీరోగా ఎంచుకున్నారట. ఇక దర్శకుడు భాస్కర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి సీన్ కూడా ఆడియన్స్ ని ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో సిద్ధార్థ్‌ కి మరింత ఫ్‌మ్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకుని ఎన్టీఆర్ పెద్ద తప్పే చేశాడు.