రజనీకాంత్ ” శివాజీ ” సినిమా రీ రిలీజ్ డేట్ లీక్… ఎప్పుడంటే…!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. శ్రియా శరణ్ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” శివాజీ “. ఈ సినిమా 2007లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఓ రికార్డునే సృష్టించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక అస్సల‌ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ సినిమాని రీ రిలీజ్ లో ట్రెండ్ లో చేర్చేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే ఈ సినిమాని డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట. నిజానికి ఈ సినిమాని డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే కొన్ని కారణాల వలన మూవీ మూడు రోజులపాటు వాయిదా పడింది. ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శివాజీగా.. రజనీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇక శంకర్ సుకుమార్ టేకింగ్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్, బిజిఎం సూపర్ అనిపించాయి. ఇక రీ రిలీజ్ లో ఈ సినిమా ఎంతమేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.