ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యని అమరదీప్…అంత రిస్క్ అవసరమా?

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరు ఎలా ఐనా విజయం సాధించాలి అనే పట్టుదలతో ఆడుతున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో అమర్ కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని అభిమానులు. నటుడు శివాజీ పదే పదే అమర్ ను టార్గెట్ చేసి, హేళన చేస్తూ అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాడని అంటున్నారు ప్రేక్షకులు. శివాజీ అంటున్న మాటలను స్పోర్టివ్ గా తీసుకుంటున్నట్టు బయటకు నటిస్తున్నా, అమర్ లోలోపల చాలా బాధపడుతున్నాడని తెలుస్తుంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో అతని ఆవేదన కన్నీళ్ల రూపంలో తన్నుకువచ్చింది. బిగ్ బాస్ అమర్ విషయాన్నీ సీరియస్ గా తీసుకువడంలేదు.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. హౌస్ లో అమర్ అస్వస్థతకు లోనయ్యాడని, ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి పడిపోయాడని ప్రచారం జరుగుతోంది. వెంటనే అతన్ని మెడికల్ రూమ్ కి తరలించి చికిత్స అందించారని తెలుస్తుంది. ఈ విషయాన్నీ అమర్ స్నేహితుడు నరేష్ ధ్రువీకరించాడు. నరేష్ మాట్లాడుతూ, అమర్ కు ఫిట్స్ రావడం నిజమేనని, అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, డిస్నీ హాట్ స్టార్ కార్యక్రమం, “నీతోనే డాన్స్” లో పాల్గొన్న అమర్ మానసికంగా, శారీరకంగా బాగా బలహీనమయ్యాడని చెప్పుకొచ్చాడు. ఆ షో కోసం విశ్రాంతి లేకుండా చాలా కాలం పని చేసాడని, ఆరోగ్యం బాగోకపోతే తానే అమర్ ని ఒకసారి డాక్టర్ దగ్గరు తీసుకువెళ్లానని చెప్పాడు. ఐతే అసలు విషయం ఏమిటంటే, అమర్ కు కండరాల ఎదుగుదల ఆగిపోయినట్టు తెలిపారట ఆ డాక్టర్.

గత రెండు నెలల నుంచి అతడి శరీరంలో మజిల్ గ్రోత్ లేదట. అందువలనే అతడు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడని అన్నాడు నరేష్. ఆ కారణం వలనే అతడికి సరిగా నిద్ర కూడా పెట్టాడట. అమర్ కు ఎన్ని సమస్యలు ఉన్న…అవేవి లెక్కచేయ్యకుండా, ఎవరికి చెప్పకుండా ఎంతో అంద్భుతంగా గేమ్ ఆడుతున్నాడని అన్నాడు నరేష్. ఐతే ఆరోగ్య పరంగా ఇన్ని ఇబ్బందులు ఉన్న అమర్ ను ఇంకా హౌస్ లో కనసాగించడం సరైన ఆలోచన కాదేమో అన్న ఆలోచనలో పడ్డారు నిర్వాహకులు.