65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న నటుడు…. ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

మలయాళం సినిమాలలో పేరుగాంచిన నటుడు ఇంద్రన్స్. ఈయన 65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. చిన్నతనం నుంచే సినిమాలపై మొక్కువతో దాదాపు 400 కి పైగా సినిమాలలో నటించాడు. అలాగే తన నటనకు గాను జాతీయ, రాష్ట్ర చలన చిత్ర అవార్డులు సైతం వచ్చాయి. ఇక 1981లో తన టైలరింగ్ షాప్ లో పని చేస్తూ, ప్రొడక్షన్ హౌస్ లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ..సెల్యులాయిడ్ లోకి ప్రవేశించి.. 1994లో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

అనంతరం పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగి ఎన్నో విజయాలను సైతం అందుకున్నారు. ఇక ఈయన నాలుగో తరగతిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేశారు. దీంతో ఇప్పుడు అంటే 65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు సమాచారం. ఇందుకోసం అతను పదో తరగతి క్లాసులకు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ఈయన ఇలా అన్నాడు..” నటుడు నిరక్షరాస్యుడాగా ఉండడం అంటే.. అంధుడి తో సమానం అని చెప్పాడు. ఇప్పుడు అతను ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసమే 10వ తరగతి పాస్ కావాలని నిర్ణయించుకున్నట్లు ” తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.