షుగర్ పేషెంట్స్ కచ్చితంగా పాటించాల్సిన డైట్ ఇదే..

ఇటీవల కాలంలో షుగర్, డయాబెటి సమస్యలతో బాధపడుతున్నవారు గణ‌నీయంగా పెరుగుతున్నారు. అలాంటివారు కచ్చితంగా ఈ ఆహార డైట్ ను తీసుకోవాలంటు నిపుణులు పేర్కొంటున్నారు. వారు ఏమి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టీ కాఫీలలో చక్కెరను జోడించడం అసలు పూర్తిగా మానుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసే హల్వా, ప్రైస్ లలో కూడా చక్కెర వినియోగించకూడదు. పండ్ల రసాల్లో పంచదార కలపకుండా తీసుకోవాలి. అసలు చక్రవంగా పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవడం మంచిది.

అలాగే స్వీట్లు, డెసర్ట్లకు చాలా దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాలు తయారీలో చక్కెరను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి వీటిని కచ్చితంగా దూరం పెట్టండి. అలాగే టమాటో సాస్, స‌లాడ్‌ డ్రెస్సింగ్ వంటి ప్రాసెస్ ఫుడ్ లలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్ ఫ్యాక్స్ చేసిన పండ్ల రసాలులో చక్కెర స్థాయి అధికంగా ఉండడం కారణంగా వీటికి షుగర్ పేషంట్స్ దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే షుగర్ పేషెంట్స్ వైట్ బ్రెడ్ కూడా తినకూడదు ఎందుకంటే దీంట్లో చక్కెర ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా పెంచుతుంది.

ఇక చికెన్, ఫిష్, దాల్ లాంటి హై ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. పనిచేసే శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి పోషకాలు ఖచ్చితంగా చాలా అవసరం. అలాగే క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ , ఓట్ మిల్ లాంటి ఆహారాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి కచ్చితంగా మంచి జీర్ణక్రియకు ఈ ఆహారం తోడ్పడుతుంది. కనుక షుగర్ పేషెంట్స్ వీటిని తమ ఆహార డైట్ లో చేర్చుకోవడం మంచిది. బాదం, చియా గింజలు, అవిస గింజలు ప్రోటీన్లు ఇంకా ఫైబర్ పుష్పాలంగా ఉంటుంది.

ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్లో స‌హ‌జ‌ చెక్కర్లు ఉంటాయి అందుకే వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ కూడా సరిగ్గా ఉంటుంది. తాజా కూరగాయల్లో విటమిన్ ఏ, సీ, కే, మెగ్నీషియం, ఐరన్ ఇంకా పోలేట్‌వంటి పోషకాలు ఉంటాయి. అలాగే ఆంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి అవి బరువును మేనేజ్ చేయడంలో శరీరంలో, పోషక లోపాన్ని పూర్తి చేయడంలో సహాయపడతాయి. మీరు తీసుకునే ఆహారంలో ఈ ఆహార పదార్థాలను జోడించడం వల్ల మీ షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉంటాయి.