టాలీవుడ్ లో ఐటీ సోదాలు.. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ ఆఫీసులో రైడ్స్‌..!

తెలుగు ఇండస్ట్రీలో గతంలో ఐటీ సోదాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి అదేవిధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో బుధవారం ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు. హైదరాబాద్ కార్యాలయంలో లావాదేవీలు పన్ను చెల్లింపుల రికార్డులను పరిశీలిస్తున్నారు ఐటీ టీమ్‌.

అభిషేక అగర్వాల్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇతను కిర్రాక్ పార్టీ, గూఢచారి, సీత, కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక‌ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ నెల 19 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగ‌ టాలీవుడ్లో ఇటీవల కాలంలో ఐటి సోదాలు సంచలనంగా మారాయి.

పన్ను ఎగ్గొట్టారని సమాచారంతో ఏడాది మైత్రి మూవీ మేక సంస్థ కార్యాలయం పై ఐటి సోదాలు నిర్వహించిన ఐటీ టీయ్‌ ఇప్పుడు తాజాగా అభిషేక అగర్వాల్ ఆఫీసులో ఐటీ సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.