గతంలో జబర్దస్త్ కమెడియన్ గా పనిచేసిన వారంతా కూడా ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. కొంతమంది కమెడీయన్స్ సైతం డైరెక్టర్ గా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వేణు కూడా ఒకరు..బలగం సినిమాతో పాపులర్ డైరెక్టర్ గా పేరు పొందారు ఈ సినిమాకి ఏకంగా అవార్డులు సైతం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వేణు బాటలోనే మరొక కమెడియన్ కూడా మారబోతున్నారు.
కామిక్ క్యారెక్టర్ తో తనదైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న కమెడియన్ ధనరాజ్.. డైరెక్టర్ గా మారడానికి సిద్ధమయ్యారు. కామెడియన్ గా పలు సినిమాలలో నటించి సక్సెస్ అయ్యి నిర్మాతగా కూడా రెండు సినిమాలు చేసి నష్టపోయారు. ఇక హీరోగా కూడా పలు రకాల ప్రయత్నం చేశారు.. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభంలో వేణు ధనరాజ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వీరిద్దరూ అప్పటినుంచి మంచి స్నేహితులు ప్రస్తుతం వేణు పలు సినిమాలో డైరెక్షన్లు బిజీగా ఉన్న ధనరాజ్ చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు.
అందుకే డైరెక్టర్ గా ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా సముద్రఖనికె కథ చెప్పి ఒప్పించడంతోపాటు అతడే లీడ్ రోల్స్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సముద్రఖని నటిస్తున్నాడని తెలిసి ఖచ్చితంగా ఈ సినిమా బెస్ట్ గానే ఉంటుందని పలువురు నెటిజన్స్ సైతం తెలుపుతున్నారు. అక్టోబర్ 22న ఈ సినిమా ఓపెనింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరి హీరోగా సక్సెస్ కాలేకపోయినా ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతారేమో చూడాలి.