బాలయ్య నా లైఫ్‌లో లేనివన్నీ అందించ్చారు.. శ్రీ లీల ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. !!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల చేస్తున్న బిగ్ ప్రాజెక్టుల‌లో భగవంత్‌ కేసరి ఒక‌టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి నటసింహ బాలయ్య కాంబోలో వ‌స్తున్న ఈ మూవీ మోస్ట్ ఎవైటెడ్‌ ఫిల్మ్‌గా రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఇటీవల గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ డైరెక్టర్స్ బాబి, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సందడి చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో హాజరై ఎమోషనల్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకుంది. శ్రీ లీల మాట్లాడుతూ ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను.

బ్యూటిఫుల్ స్టోరీలో విజ్జి పాపగా సోల్ కనెక్టెడ్ క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను చాలా స్టోరీస్ పై సినిమాలు చేస్తున్నాను. కానీ ఈ మూవీ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. రోజులు గడుస్తున్న కొద్ది నేను ఆ రోల్ లో క్యారెక్టర్ లా మారిపోయా. సినిమాను చాలా బ్యూటిఫుల్ తెర‌కెక్కించ్చారు. బాలకృష్ణతో నాకు చాలా ఎమోషనల్ టైం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ అద్భుతంలా అనిపించింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు చేసేటప్పుడు డైరెక్టర్ క‌ట్‌ చెప్పిన అదే ఫీలింగ్ తో కంటిన్యూ అయ్యాను. వెంటనే బయటికి రాలేకపోయా అలాంటి సందర్భాల్లో నన్ను నవ్వించి నార్మల్ స్టేజ్ కి తీసుకువచ్చారు బాల‌య్య‌.

ఆయ‌న నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గుర్తుండిపోతాయి. ఇక బాలయ్య నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా అందించారు. ఇది మీ గొప్పమనసు అంటూ ఎమోషనల్ అయింది. తన స్వీట్ స్పీచ్‌తో బాలయ్యను ఆకాశానికి ఎత్తింది. సెట్స్ లో నందమూరి నట‌సింహతో కలిసి చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంతో సంతోషాన్ని కల్పించిందని. అలాగే టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడి పని చేశారంటూ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు సినిమాను ఎంజాయ్ చేస్తారంటూ పేర్కొంది శ్రీ‌లీల. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.