అనిల్ రావిపూడి తండ్రి ఏం ప‌ని చేస్తారో తెలుసా.. కొడుకు స్టార్ డైరెక్ట‌రైనా ఆయ‌న మాత్రం..??

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా కీలకపాత్రను పోషించింది.

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వరంగల్ లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి భగవంత్ కేసరి ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే భగవంత్‌ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వంశి పైడిపల్లి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

ఇండస్ట్రీలో తనకున్న తమ్ముడు అనిల్ రావిపూడి అని.. చాలా సరదా మనిష‌ని.. ఎవరు ఎంత బాధలో ఉన్నా న‌వ్విస్తాడ‌ని వంశీ చెప్పుకొచ్చాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్వ‌యంకృషితో అనిల్ స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడ‌ని తెలిపారు. అలాగే అనిల్‌ తండ్రిని కూడా స్టేజి పైకి పిలిచి అందరికీ పరిచయం చేశారు వంశీ పైడిప‌ల్లి. అనిల్ వాళ్ళ నాన్న ఒక మామూలు బస్సు డ్రైవర్ అని వంశీ తెలిపారు. కొడుకు స్టార్ డైరెక్ట‌రైనా ఆయ‌న చాలా సింపుల్ గా ఉంటార‌ని.. అనిల్ కూడా అంతే అని తెలిపారు. వంశీ మాట‌లు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు అనిల్ రావిపూడి నిజంగా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. భ‌గ‌వంత్ కేస‌రితో ఆయ‌న మ‌రో హిట్ కొడ‌తార‌ని అంటున్నారు.