పింక్ శారీలో సమంత బ్లాస్టింగ్ అందాలు.. ఇంత‌కీ ఆమె చీర ఖ‌రీదెంతో తెలుసా?

చెన్నై సోయ‌గం స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ ఈ బ్యూటీ మంచి క్రేజ్ తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత కెరీర్ ను జెట్ స్పీడ్ లో ప‌రుగులు పెట్టించింది. కానీ, ఇంత‌లోనే మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డ‌టంతో.. చికిత్స తీసుకుని చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది.

ఆపై సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్ర‌స్తుతం స‌మంత విదేశాల్లో చిల్ అవుతూ.. శారీర‌కంగా, మాన‌సికంగా స్ట్రోంగ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే స‌మంత‌.. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో ఫాలోవ‌ర్స్ ను అల‌రిస్తూనే ఉంటుంది. తాజాగా పింక్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ పిక్స్ లో స‌మంత బ్లాస్టింగ్ అందాల‌తో నెటిజ‌న్ల‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో హీట్ పెంచేసింది.

స‌మంత లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు స‌మంత క‌ట్టుకున్న ఆ పింక్ శారీ ఖ‌రీదు హాట్ టాపిక్ గా మారింది. కాస్ట్లీలో వ‌స్తువుల‌తో సామాన్య‌లు క‌ళ్లు చెదిరేలా చేయ‌డం స‌మంత‌కు అల‌వాటు. దీంతో ఆమె తాజాగా క‌ట్టుకున్న గులాబీ రంగు చీర కూడా ఏ ల‌క్షో, రెండు ల‌క్షలు ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ, స‌మంత చీర ఖ‌రీదు జెస్ట్ రూ. 15 వేలు. ప్ర‌ముఖ సుప్రసిద్ధ బ్రాండ్ ఏకాయ(Ekaya)కు చెందిన ఫుచ్సియా పింక్ సిల్క్ చీరను స‌మంత క‌ట్టుకుంది. ఈ శారీ ఖ‌రీదు రూ. 14,975. ఆన్‌లైన్‌లో ఈ శారీ ఉంది. కావాలి అనుకుంటే మీరు కూడా కొనేసుకోవ‌చ్చు.