లాయర్ పాత్రలో నటించి ఫెయిల్ అయినా హీరోయిన్లు వీళ్లే….!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏమాత్రం తగ్గడం లేదు. వారి గ్లామర్ పాత్రలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోయిన్లు ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ వారి ఇమేజ్ను పెంచుకుంటు ఉంటారు. కొందరు హీరోయిన్లు డాక్టర్, లాయర్, మోడల్ ఎలా ఏదో ఒక వృత్తిలో నటిస్తూ వారి పాత్రలతో మెప్పిస్తున్నారు. సినిమాలో లాయర్ పాత్రలో నటించి హీరోయిన్లు కొంతమంది మెప్పించ‌గా.. మరి కొంతమంది మాత్రం ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయారు . ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

* రాశిఖన్నా:


అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా రీసెంట్గా నటించిన మూవీ పక్కా కమర్షియల్. ఈ సినిమాలో రాశి కన్నా లాయర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో రాసి కన్నాకి అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు.

* తమన్నా:


చిరంజీవితో కలిసి సైరా సినిమాలో నటించిన తమన్నా.. ఇక రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో తమన్నా లాయర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఈ అమ్మడు పాత్రకి పెద్దగా గుర్తింపు రాలేదు.

* కీర్తి సురేష్:


స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తి సురేష్ రీసెంట్గా మలయాళం మూవీలో లాయర్ గా కనిపించింది. టోవినో థామన్ తో కలిసి చేసిన కీర్తి సురేష్ లాయర్ పాత్రలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

* రకుల్ ప్రీత్ సింగ్:


రకుల్ చెక్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

* వరలక్ష్మి శరత్ కుమార్:


డైనమిక్ లేడీ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఫెయిల్ అయినప్పటికీ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నాంది సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర‌కి రెస్పాన్స్ అదిరిపోయింది .