రవితేజ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఛాన్స్ వస్తే ఆ క్రికెట‌ర్ బయోపిక్ చేస్తాడ‌ట‌..?!

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం తెలుగు తో పాటు భారతీయ ప్రధాన భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అన్ని భాషల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా తాజాగా రవితేజ వరల్డ్ కప్ మ్యాచ్లో దర్శనమిచ్చాడు. ఆశ్రయ భారత్ మ్యాచ్ లో రన్నింగ్ కామెంట్రీ లో పాల్గొని స్టార్ స్పోర్ట్స్ లవర్స్ తో రవితేజ చేసిన చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రవితేజ మాట్లాడుతూ తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడగగా విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్ దూకుడు అంటే చాలా ఇష్టమని కోహ్లీ బ్యాట్‌ని హ్యాండిల్ చేసే విధానం చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.

ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు రవితేజ ఆసక్తిగారి సమాధానం చెప్పాడు. ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే ఏ క్రికెటర్ పై చేస్తారని ఫ్యాన్ అడగగా రవితేజ వెంటనే మహమ్మద్ సిరాజ్ అని చెప్పేసాడు. తనకు క్రికెటర్ బయోపిక్ నటించే అవకాశం వస్తే తప్పకుండా సిరాజ్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ వివరించాడు.