వయోలెట్ లెహంగాలో సిరి హనుమంత్ పరువాల విందు చూడండి!

సిరి హనుమంత్ పేరు వినగానే అందరికీ బిగ్ బాస్ 5 సీజన్ గుర్తుకు వస్తుంది. అవును, ఆ షో ద్వారా పరిచయమైన సిరి, తనదైన ఆటతీరుతో తెలుగు కుర్రళ్లను మైమరిపింపజేసింది. నిజం చెప్పాలంటే వివాదాలతో ఎక్కువ పోపులారిటీ సంపాదించింది. ఆ షో తరువాత సిరి తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే అడపాదడపా నటిగా కూడా రానిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలవగా ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు.

సిరి అయితే టాప్ 5లో కొనసాగుతూ వుండేది. ఆ షోలో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో ఆమెపైన అనేక రూమర్లు కూడా వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. తాజాగా సిరి ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతూ వయోలెట్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. నడుము దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి ఊరిస్తున్న ఇస్తున్న ఫోజులను చూసి కుర్రాళ్ళు కిర్రెక్కిపోతున్నారు. లెహంగాలో సిరి నాట్య మయూరిలా హొయలు పోతూ వుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అవును, ఆమె ఫోటోలు చూస్తే మీరు కూడా ఆదేమాట అంటారు. దాంతో కుర్రళ్ళకి మంచి కనువిందు లభించింది. సిరి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని చూసిన జనాలు ఫిదా అయిపోతున్నారు. చంద్రబింబం లాంటి ఆమె ముఖం, నదిని పోలిన నడుము మతిపోగొడుతున్నాయి అంటూ నెటిజన్లు అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ 5లో గ్లామర్ తో ఆకర్షించిన సిరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫార్ములానే ఉపయోగిస్తోంది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.