Bigg Boss 7: హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి అంజలి..!!

బిగ్బాస్ ఐదో వారం చాలా రసవక్తంగా ప్రారంభమైంది. ఈసారి ఎలిమినేషన్ నాలుగు వారాలకు భిన్నంగా జరుగుతుందని నాగార్జున చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా ఆరుగురు హౌస్ లోకి వెళ్ళనున్నట్లు పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మొగలిరేకులు సీరియల్ నటి అంజలి పవన్ యూట్యూబ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

అంజలి మాట్లాడుతూ..” బిగ్ బాస్ కు వెళ్తున్నాన? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. బిగ్ బాస్ అనగానే ఆమ్మె అనిపించింది. ఎందుకంటే నేను ఇల్లు వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా తర్వాత పవన్.. వీళ్లను వదిలి ఎక్కడికి వెళ్లలేదు. దాన్వికా పుట్టిన తరువాత తనే నా ప్రపంచమే అయిపోయింది. తను బెంగ పెట్టుకుంటుందో లేదో కానీ నేను మాత్రం బెంగ పెట్టుకుంటాను.

పవన్ బిగ్ బాస్ కు పోతే బాగుండేది. కానీ నేను వెళ్లాలనేసరికి ఆలోచించాను. ఎన్ని రోజులు అక్కడ ఉంటామో తెలియదు. అది సెట్ కాదు అనిపించింది. నన్ను వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇవ్వమని అడిగారు. కానీ నేను వెళ్లలా..? వద్దా..? అని ఆలోచించాను. అలాగే వెళ్లాక నెగిటివ్ అయి వస్తే బాగోదనిపించింది. అందుకే వెనకడుగు వేశాను. ఈ సీజన్ కు వద్దు అనుకున్నాను. నేను బిగ్ బాస్ 7 లో పాల్గొనడం లేదు”అంటూ క్లారిటీ ఇచ్చింది.