ఇండియా పేరు భార‌త్‌గా మార్పుపై ఐక్య‌రాజ్య‌స‌మితి సంచ‌ల‌న డెసిష‌న్‌…!

కేంద్ర ప్రభుత్వం ఇండియా అనే పేరును భారత్‌గా మార్చ‌బోతోందన్న ఊహగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ్ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. ” చివరిసారిగా… టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం.

ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం” అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ కు బదులుగా ‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ‘ అని ఉండడంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది.

కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతుంది. బీజేపి నియర్దలకు కౌంటర్ ఇస్తుంది. వికాక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం ఆశ్చర్యం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారు.