‘ స్కంద ‘ సెన్సార్ టాక్ … ర‌న్ టైం ఎన్ని నిమిషాలంటే…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో… శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా స్కంద. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న స్కంద పై రామ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుని.. మూవీపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింత పెంచేశాయు. ఇక సెప్టెంబర్ 15న‌ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రభాస్ ‘ సలార్ ‘ విడుదల వాయిదా పడడంతో, ‘ స్కంద ‘రిలీజ్ డేట్ ను కూడా మూవీ యూనిట్ సెప్టెంబర్ 28 కి మార్చింది. తాజాగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.

ఇక రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాల 22 సెకండ్లుగా ఉండనుంది. ఇతర సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా రన్ టైమ్ ఎక్కువే… సినిమా స్టోరీ ఆసక్తికరంగా ఉంటే రన్ టైమ్ ఎంతున్నా చూస్తారు. కానీ సినిమాలో మేటర్ లేకుండా రన్ టైమ్ ఎక్కువ ఉన్న ప్రయోజనం లేదు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.