పాపం విజ‌య్‌.. `ఖుషి`తో హిట్ కొట్టిన ఆనంద‌మే లేదు.. అంతా స‌మంత వ‌ల్లే!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గ‌త ఏడాది ఈయ‌న నుంచి వ‌చ్చిన లైగ‌ర్ దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. లేటెస్ట్ రిలీజ్ అయిన `ఖుషి` మూవీతో విజ‌య్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన‌ట్లే అని అంతా అనుకున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఇందులో హీరోయిన్ గా న‌టించింది.

సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఖుషి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ఉంది. దీంతో హిట్ ఖాయ‌మ‌ని విజ‌య్ మ‌రియు చిత్ర టీమ్ ఫుల్ గా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ఆనందం విజ‌య్ కు లేకుండా పోయింది. ఎందుకంటే, ఖుషి మూవీకి హిట్ వ‌చ్చినా కూడా.. బాక్స‌ఫీస్ వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదు. రూ. 15 కోట్ల దూరంలోనే ఆగిపోయింది.

ఖుషి మూవీ రూ. 53 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింద‌ది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 38.30 కోట్ల షేర్‌, రూ. 70 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 15.20 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ, పోటీగా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి, జ‌వాన్ చిత్రాలు దిగాయి. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. వీటి పోటీ త‌ట్టుకుని రూ. 15 కోట్లు రాబ‌ట్ట‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. దీంతో విజ‌య్ కు మ‌ళ్లీ ఫ్లాపే అని కొంద‌రు అంటున్నారు. అంతేకాదు, ఇందుకు కార‌ణం స‌మంతే అని ఫైర్ అవుతున్నారు. ఆమె ప్ర‌మోష‌న్స్ కు వ‌చ్చుంటే సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయ్యేది.. దాంతో ఈపాటికే ఖుసి బ్రేక్ ఈవెన్ అయ్యేదంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.