విల‌న్‌గా స్విటీ అనుష్క‌… ఏ సినిమాలోనో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ సినిమాల పరంగా తన జోరు పెంచిందని తెలుస్తుంది. ‘ నిశ్శబ్దం ‘ సినిమా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ… తాజాగా ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలియాళ భాషల్లో సెప్టెంబర్ 7 (నిన్న) విడుదలయ్యింది.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క తొలిసారిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. పి. మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి మలయాళం లో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తుంది. ఈమె తన 18 ఏళ్ల సినీ జర్నీలో తెలుగు, తమిళం సినిమాల్లో తప్ప ఇతర ఏ భాషాల్లో నటించలేదు. మొదటిసారిగా ఈమె మళయాళం సినిమాల్లో నటిస్తుంది. ‘ కాథానార్ ‘ అనే మలయాళం సినిమాలో అనుష్క విలన్ గా నటిస్తుందని సమాచారం.

లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సైతం తనదైన ప్రతిభ చూపించిన అనుష్క విలన్‌గా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ‘ కాథానార్ ‘ హారర్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో మలయాళ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కడమట్టు అని ప్రాంతంలోని చర్చి ఫాదర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదలయ్యాయి. హారర్ ఎలిమెంట్స్ తో కొత్త బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.