జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా.. షారుక్‌కి దిమ్మతిరిగేలా రిజల్ట్..!

షారుక్ ఖాన్ నయనతార, విజయ్ సేతుపతి కీ రోల్స్‌లో నటించిన మూవీ జవాన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్ గా ఈ సినిమా అవతరించింది. హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పఠాన్‌ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న రిలీజ్ అయిన జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా రికార్డులను దాటేసింది. తొలి రోజు ఏకంగా రూ.14 లక్షలు పైగా టికెట్లను అమ్మిన రికార్డ్స్ సృష్టించింది.

అట్లి దర్శకత్వం వహించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. జవాన్ ఇప్పటికే భారతదేశం బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. అసాదారణమైన అడ్వాన్స్ బుకింగ్లతో రికార్డులను సృష్టించిన. 10,000 స్క్రీన్‌లలో విడుదలై భారత చలనచిత్రాల్లో అత్యధికంగా విడుదలైన వాటిలో ఒకటిగా నిలిచింది. దీపిక పదుకొనే గెస్ట్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో రిలీజ్‌కి ముందే భారీ హైట్ ను సొంతం చేసుకుంది.

మొదటి షో ఉదయం 6 గంటలకు వేశారు. సినిమా ట్రేడ్ నిపుణులు తరుణ్ ఆదర్శ్ మాట్లాడుతూ జవాన్ అన్ని భాషల్లో ఓపెనింగ్ ఫ‌స్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కోట్లు దాటవచ్చని చెప్పారు. జవాన్ మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ప్రదర్శనను కనబరిస్తూ ట్రేడ్‌ నిపుణులను ఆశ్చర్యపరిచింది. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆక్యూపేన్సి అన్ని భాషల్లో కలిపి రూ.75 కోట్ల నెట్ సొంతం చేసుకుంది. హిందీలో రూ.65 కోట్లు దక్కించుకుంది. తమిళం రూ.5 కోట్లు తెలుగులో రూ.5 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈరోజు జవాన్ కలెక్షన్స్ కూడా భారీ రేంజ్‌లోనే ఉన్నట్లు సమాచారం.