అందరి ముందు నిత్యా మీనన్ తో అలా చేసిన నాని..? ఇదేం ఫ్రెండ్ షిప్ రా బాబోయ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.. డైరెక్టర్స్ – ప్రొడ్యూసర్స్ – హీరోస్ – హీరోయిన్స్ ఇలా బోలెడు మంది చాలా జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే చాలా రేర్ గా మాత్రమే ఒక హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ ను ఎక్కువ కాలం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తారు మలయాళీ కుట్టి హీరోయిన్ నిత్యామీనన్ నాచురల్ స్టార్ హీరో నాని . వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా అలా మొదలైంది . మలయాళీ కుట్టి నిత్యామీనన్ తెలుగులో తెరంగేట్రం చేసిన సినిమా ఇదే కావడం గమనార్హం .

కాగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా క్రేజీ కాంబో గా కూడా పేరు సంపాదించుకున్నారు నిత్యామీనన్ – నాని . ఈ సినిమా ద్వారానే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఎంతలా అంటే ఓ రోజు ఓ ఫంక్షన్ లో నాని డైరెక్ట్ గా నిత్యామీనన్ ప్లేట్ లో ఉన్న ఫుడ్ తీసుకొని మరి తన ప్లేట్లో వేసుకొని తినేంతలా.. అయితే మొదటి నుంచి ఇలాంటివి ఇష్టం లేని నిత్యామీనన్ ..నాని పై సీరియస్ అయిపోయిందట.. ఫుల్ ఫైర్ అయిపోయిందట.

” సిగ్గు లేదా నీకు..?” అంటూ అందరి ముందే తిట్టేసిందట . అయితే “ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ అని ..లైట్ తీసుకో ..నాకు సిగ్గులేదు నీకు ఉందిగా తిను “అంటూ నాని చాలా కూల్ అండ్ జోవియల్ గా ఆన్సర్ ఇచ్చారట . నిత్యామీనన్ కూడా కూల్ అయిపోయి నవ్వేసిందట . అయితే ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి చాలా సర్వసాధారణం కానీ అంత పెద్ద స్టార్స్ సెలబ్రిటీస్ కూడా ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటారా ..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కొంతమంది ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబోయ్ అంటూ ఉంటే.. మరి కొందరు ఫ్రెండ్షిప్ అంటే ఇదే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!