రవితేజకి విలన్‌గా మంచు మనోజ్.. బేబి ప్రొడ్యూస‌ర్‌ స్కెచ్ అదిరిపోయింది..!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మల్టీ స్టార‌ర్ గా రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన రాలేదు. కానీ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ తో పాటు మాస్కా దాస్ విశ్వక్సేన్ మరో హీరోగా నటించబోతున్నాడట.

బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కే య‌న్ ఈ మల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటోతో హిట్స్ సొంతం చేసుకున్న సందీప్ రాజా సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో విలన్ పాత్ర కోసం మంచు మనోజ్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ కాంబినేషన్ అదిరిపోయేలా ఎస్ కే య‌న్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల బేబీ మూవీకి య‌స్ కే య‌న్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అతి తక్కువ బడ్జెట్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తెరపైకి వచ్చి భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో బేబీ మూవీ ప్రొడ్యూసర్ రవితేజతో తీయబోయే సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. మంచు మనోజ్ కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మంచు మనోజ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా వర్కౌట్ అయితే మంచు మనోజ్ హీరోగా కూడా మళ్లీ కమ్‌ బ్యాక్ కావడం ఖాయం అంటూ నిటిజన్లు భావిస్తున్నారు.