బంగ్లాదేశ్‌లో జ‌వాన్ నిషేధం.. కార‌ణం అదే..!

ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్‌ డే ప్రేక్షకుల వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు బాడ్ న్యూస్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్.. పక్క‌ దేశమైన బాంగ్లాదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదట.

గతంలో షారుక్ చేసిన పాఠాన్ కూడా అదే రోజు బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు. తాజాగా జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్‌లో విడుదల కాకపోవడంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బంగ్లాదేశ్‌లో జవాన్ సినిమా విడుదల కాకపోవడానికి గల కారణం ఏంటో ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అంతర్ యుద్ధం జరుగుతున్న పరిస్థితి. దీంతో వచ్చే ఏడాది 2024 లో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ప్రజలు పలుచోట్ల ప్రభుత్వం పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సామాజిక పరిస్థితులు పూర్తిగా నశించాయి. కొన్నిచోట్ల కర్ఫ్యూ వాతావరణ నెలకొనడంతో అక్కడ జవాన్ విడుదల బంగ్లాదేశ్ బోర్డు నిషేధించింది. దీంతో బంగ్లాదేశ్‌లోని షారుక్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి జవాన్ సినిమా రిలీజ్ చేయాలంటూ నిరసన చేపట్టారు. ఇప్పట్లో బంగ్లాదేశ్ షారుఖ్ ఖాన్ జవాన్‌ని థియేటర్స్‌లో ఎప్పుడు ఇస్తుందో చెప్పడం కష్టమే.