కొడుకు చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న ఎన్టీఆర్ తల్లి..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.. ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో ఎప్పుడు ఎలాంటి మచ్చ కూడా రాలేదు.. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత చాలామంది సెలబ్రిటీల గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ మీద ఎలాంటి రూమర్స్ ఇప్పటివరకు బయటకి రాలేదు.

Here's how man of masses Jr NTR's mother ignited his passion for Indian  classical dance | Telugu Movie News - Times of India

ఎన్టీఆర్ తల్లి శాలిని చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ను ఎంతో క్రమశిక్షణతో పెంచారని చెప్పవచ్చు. ఎన్టీఆర్కు ముఖ్యంగా పెద్దలు అంటే గౌరవం ఉండడమే కాకుండా మహిళల పట్ల చాలా వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ ఎన్టీఆర్ కు చిన్నవయసు నుంచే తన తల్లి వివరించిందట.. ఒకానొక సమయంలో శాలిని ఎన్టీఆర్ తో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కూడా మహిళల పట్ల హీరోయిన్ల పట్ల ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడకూడదని అలా ప్రవర్తించకూడదని వారికి గౌరవం ఇవ్వాలని చెబుతూ ఎన్టీఆర్ నుంచి ఒక మాట తీసుకున్నట్లు సమాచారం..

అలాగే తన ఏ పని చేసిన కూడా నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మాట తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా అప్పుడు తల్లికి ఇచ్చినటువంటి ఈ మాట కోసమే ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు మహిళల పట్ల దురుసుగా ఎప్పుడు ప్రవర్తించిన దాఖలు కనిపించలేదు.. ఇలా ఎన్టీఆర్ మహిళలకు తోటి సెలబ్రిటీలకు సైతం గౌరవం ఇస్తారని విషయాన్ని ఇదివరకు చాలామంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలియజేశారు.