షారుక్ సినిమాపై దిమ్మతిరిగే రివ్యూ చెప్పిన మహేష్..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జవాన్.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటించారు.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీల సైతం జవాన్ సినిమాకు సంబంధించి రివ్యూ ని సైతం విడుదల చేయడం జరిగింది.

Mahesh Babu's Maharshi Based On Shah Rukh Khan Movie?

అలాగే ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ సినిమాను చూసి తన రివ్యూ ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది..షారుక్ జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తాజాగా మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..ఈ ట్వీట్ లో షారుక్ ఖాన్ డైరెక్టర్ అట్లీతో పాటు చిత్ర బృందాన్ని విష్ చేయడం జరిగింది మహేష్ బాబు.. ఈ ట్విట్ కు సైతం షారుఖ్ ఖాన్ లవ్ యు బ్రదర్ అంటూ కూడా రిప్లై ఇవ్వడంతో పాటు కలిసి సినిమా చూద్దామంటూ కూడా తమ ట్విట్ లో కొటేషన్స్ షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కానీ ఈ లోగే షారుక్ జవాన్ సినిమాను తన ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు చూడడం జరిగింది. షారుక్ ఖాన్ కు తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాని ఇచ్చారంటూ డైరెక్టర్ అట్లేని సైతం పొగడడం జరిగింది మహేష్ బాబు.. షారుక్ ఖాన్ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ మహేష్ షారుఖ్ ని అభినందించడం జరిగింది. షారుఖ్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటారు జవాన్ బ్లాక్ బాస్టర్ అంటూ తన రివ్యూ ను ఇచ్చేశారు అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.