పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!!

ఏ ఫంక్షన్ ,పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అలాగే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా మరో పక్క వచ్చిన అతిధుల‌కు వాటిలోనే టి, కాఫీ, భోజనం, మంచినీళ్లు ఇక అవి ఇవి అని ఇస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఈ డిప్పోజబుల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటాం.

వీటిని వాడేసాక బయట వేసేస్తూ ఉంటాం.. చెత్తలో భాగమైపోయి నేలలో కలిసిపోతాయని ఆలోచన వీటిలో పేడివి తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్లో ఉపయోగించే పేపర్‌ని.. ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్.. చేతిలో ఉన్న కాఫీ నుంచి కాగితాన్ని రక్షిస్తుంది. ఈ రోజుల్లో, ప్లాస్టిక్ ఫిల్మ్ ఎక్కువ‌డా పాలీలాక్టైడ్, పిఎల్ఎ, ఒయోప్లాస్టిక్ రకం తో తయారు చేస్తున్నారు.

ఒయోప్లాస్టిక్ మార్కెట్లోని 99% ప్లాస్టిక్ ఉంటుంది. మామూలు ఫ్యాకేజింగ్ లో మొక్కజొన్న సరుగుడు, చెరకు నుండి ఉత్పత్తిని ఎక్కువగా వాడుతున్నారు. అవి అంత ప్రమాదం కాదు.. ప్లాస్టిక్ల కంటే వేగంగా విచ్ఛిన్నంమపుతుంది.. కానీ ఒయోప్లాస్టిక్ నేలలోకి, నీటి మీదకు చేరినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండటం లేదు. ఈ కప్పులు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ రెండు కూడా ప్రమాదమే.. అందుకే వీటి జోలికి వెళ్లడం తగ్గించడం మంచిది.