పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తా అంటున్న మహేష్ బావ..!

టాలీవుడ్ యంగ్ హీరో మహేష్ బాబు చిన్న బావ సుధీర్ బాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ విజయల కోసం కష్టపడుతూ వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న అల్లుడుగా, మహేష్ బాబు బావగా పేరు ఉన్న కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడానికే మొదటినుంచి ఎంతో కష్టపడుతున్నాడు.

ఇక ప్రస్తుతం సుదీర్ బాబు చేతిలో మూడు సినిమాలుకు పైగా ఉన్నాయి. ఆయన ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలంటే టాలీవుడ్ లో సుధీర్ బాబు అందరి హీరోల కంటే ముందు వరుసలో ఉంటాడు. ఆయన బాడీని ఎలా కావాలంటే అలా మలచడంలో సిద్ధహస్తుడునే చెప్పాలి. ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే తాజాగా సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.

ఒకవేళ సుదీర్ హీరోగా కాకుండా ప్రస్తుతం డైరెక్టర్ అయితే ఆయన చేసే సినిమాలో హీరో ఎవరు..? ఎలాంటి కథను ఎంచుకుంటారు..? అన్న ప్రశ్నకు సుధీర్ బాబు తడబడకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా అందులో పవన్ ను సీఎంగా చేస్తాం.. నా సినిమాలో పవన్ సీఎంగా చూడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బావ మహేష్ తో సినిమా చేస్తా అనకుండా పవన్ పేరు చెప్పడం పవన్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఇక ఇది నిజం అవుతుందా..? లేదా..? అన్న విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సీఎం అనటంతో ఫ్యాన్స్.. వచ్చే సంవత్సరం నిజంగానే సీఎం అవుతాడు.. అప్పుడు సినిమా తీయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.