గీజర్ వాడుతున్నారా.. తప్పక తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

వర్షాకాలం, చలికాలం ఈ సీజ‌న్‌ల‌లో చన్నీటితో స్నానం కష్టతరం అయిపోతుంది. అలాగని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ పై నీళ్లు కాచి స్నానం చేయడం అనేది సాధ్యం కాదు. గ్యాస్ ధరలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రస్తుతం తమ ఇళ్లల్లో గీజర్లను వాడడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు అయితే వాటిని సరిగ్గా వాడకపోయినా ఆఫ్ చేయడం మర్చిపోయిన షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇందుకోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. గిజర్లను ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచకూడదు. ఇది ఎక్కువ సేపు వేడెక్కడం వల్ల దాని బాయిలర్లో ఒత్తిడి పెరిగి పేలిపోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చోట్ల ఉండేవారు ప్రతి రొండేళ‌కి ఒక‌సారి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది.

లేదంటే వాటిలోని ఆటోమేటిక్ సెన్సార్లు పనిచేయడం ఆగిపోతాయి. ఆపడం మర్చిపోయిన పేలే ప్రమాదం ఉంటుంది. మీ గీజర్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 60 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ ప్రజర్‌ను కంట్రోల్ చేయడానికి ట్యాంక్ పేలడం లాంటివి జరగకుండా ఉండడానికి ప్రెషర్ కంట్రోల్ ఫీచర్లను ఉండేలా చూసుకోండి.