పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఓజి టీజర్ టైం ఫిక్స్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇప్పటికీ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. మిగతా భాగం కూడా శ‌రవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇయర్ ఎండింగ్‌కి విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. డిసెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఉద్దేశంతో షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ని మేకర్స్ రివీల్‌ చేశారు. ఓజి టీజర్ త్వరలోనే రాబోతుందని మేకర్స్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అద్భుతమైన టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ చేయబోతున్న విషయం చెప్పినప్పుడు నుంచి కరెక్ట్ టైం చెప్పండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను ప్రశ్నించారు.

దీంతో తాజాగా వారు ఏ టైం కు సెప్టెంబర్ 2న మనం టీజర్ రిలీజ్ చేయాలో మీరే చెప్పండి అంటూ ఇవాళ మార్నింగ్ కామెంట్ చేశారు. సాయంత్రం లోపు ఒక పర్ఫెక్ట్ టైమ్ ఫిక్స్ చేద్దామని వారు తెలిపారు. చెప్పినట్లుగానే ఉదయం 10:30 నిమిషాలకు టీజర్ రానుందని ట్విట్ చేశారు. కేవలం 70 సెకండ్ల టైంతో ఇటీజర్ రిలీజ్ కాబోతుందని సమాచారం. నటుడు అర్జున్ ధాస్ వాయిస్ ఓవర్ తో ఎలివేషన్ డైలాగ్స్ కూడా ఉంటాయట. ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. దీంతో పవర్ స్టార్ ఓజి సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.